వచ్చే వారంలో టీడీపీకి రాజీనామా: కవిత | tdp leader kavitha resigns to party next week | Sakshi
Sakshi News home page

వచ్చే వారంలో టీడీపీకి రాజీనామా: కవిత

Oct 30 2017 1:23 PM | Updated on Aug 10 2018 8:31 PM

tdp leader kavitha resigns to party next week - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి:  సినీ నటి కవిత వచ్చే వారంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. 1983 నుంచి టీడీపీకి  సేవలందించిన ఆమె టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మధ్య కాలంలో ఆమె బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో సమావేశమయ్యారు. బీజేపీలో చేరేందుకు కవిత రంగం సిద్ధం చేసుకొన్నారు. కవిత పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. 

పార్టీ కోసం  కష్టపడిన వారికి గుర్తింపు లేదని, భజనలు చేసే వారికే పార్టీలో గుర్తింపు, ప్రాధాన్యత దక్కుతున్నాయని ఆరోపించారు. అంతేకాదు నన్ను మెడ పట్టుకుని బయటకు గెంటినట్లు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలు తెలిసి కూడ  చంద్రబాబునాయుడు తనకు ఏమీ తెలియనట్టుగా ఉన్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.  టీడీపీ అధినాయకులు తన కష్టాన్ని గుర్తించకపోగా.. ఎన్నో అవమానాలకు గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాను తీవ్ర మనస్తాపం చెందుతున్నానని, తాను చేరేందుకు అనేక .పార్టీలు సిద్దంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement