వైఎస్సార్‌ సీపీలో భారీ చేరికలు

TDP, Congress leaders join YSRCP - Sakshi

జగన్‌ సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్‌ నాయకుల చేరికలు

అంబాజీపేట: వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు శనివారం ప్రజా సంకల్పయాత్రలో వైఎస్సార్‌ సీపీలోకి చేరారు. ఊలపల్లి, బిక్కవోలు క్యాంపు కార్యాలయం వద్ద, కాంగ్రెస్, టీడీపీల నుంచి 50 మంది నాయకులు జననేత సమక్షంలో పార్టీలో చేరారు. అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి, పెదపూడి మండలం రామేశ్వరానికి చెందిన మాజీ సర్పంచి కొటికలపూడి చినబాబు, ఏపీ త్రయం సర్పంచి గుండా ఈశ్వరరావు, పైన గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు గుండేపల్లి శ్రీనివాసరావు, రామేశ్వరానికి చెందిన ముమ్మిడి రవిశంకర్, నక్కా రాజు, రంగంపేటకు చెందిన టీడీపీ మండల నాయకులు మచ్చా సతీష్‌రాజు, ఉందడరావు సత్యనారాయణ, సంపర మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అద్దంకి ముక్తేశ్వరరావు, అనపర్తి మండలం పీరా రామచంద్రపురం ఎంపీటీసీ మాజీ సభ్యుడు కోనాల వెంకట సాయిరామారెడ్డితో పాటు పలువురు జననేత సమక్షంలో పార్టీలో చేరారు. 

వారికి జననేత పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా కో ఆర్డినేటర్‌ సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామారెడ్డి మాట్లాడుతూ జననేతను సీఎం చేందుకు అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. భవిష్యత్తులో నాటివైఎస్‌ స్వర్ణయుగాన్ని చూస్తామన్నారు. టీడీపీ రాక్షస పాలనలో విసుగు చెందిన ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని, నవరత్నాల పథకాలను అన్నివర్గాల ప్రజలకు వివరించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలనివారు కోరారు. 

గుడిమూల గ్రామం నుంచి 200 మంది
మలికిపురం (రాజోలు): నియోజకవర్గంలోని సఖినేటిపల్లి మండలం గుడిమూల గ్రామంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోనికి రెండు వందల మంది చేరారు. టీడీపీ నాయకులు గుబ్బల అభిమన్యుడు, ఉక్కునూరి రామకృష్ణ, కోరశిక సత్యనారాయణ, గొర్ల రాంబాబు, శనకం కాటంరాజు, గుబ్బల పెద్దిరాజు, పొన్నపల్లి రమేష్, సావిత్రి, గూడపల్లి రమణ, వెలదూటి రమేష్‌తోపాటు సుమారు 200 మంది పార్టీలో చేరారు. పార్టీ కో ఆర్డినేటరు బొంతు రాజేశ్వరరావు, సీనియర్‌ నాయకులు రుద్రరాజు వెంకట్రామరాజు ఆధ్వర్యంలో వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా జరిగిన సభలో కో ఆర్టినేటర్‌ మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పూర్తి మెజార్టీ సాధించి పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని సూచించారు. పార్టీ నాయకులు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జంపన బుజ్జిరాజు, ఎస్సీ విభాగం కార్యదర్శి నల్లి డేవిడ్, దొంగ నాగ సత్యనారాయణ, పాటి శివకుమార్, ఇందుకూరి పిప్పరరాజు, సర్పంచి కందుల సూర్యచంద్రరావు, గుబ్బల వేణు, ఉప సర్పంచి బీనబోయిన ఏసుబాబు, గ్రామ శాఖ అధ్యక్షుడు కోన ఎహెజ్కేలు, ఎంపీటీసీ సభ్యుడు కోన ప్రభాకర్, ఆర్‌.చినరాజు పాల్గొన్నారు. 

జగనన్నకు తోడుగా టీడీపీ నుంచి..
భానుగుడి (కాకినాడ రూరల్‌): జననేతను సీఎంగా చూడాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ సీపీ గెలుపునకు కృషి చేస్తామంటూ పార్టీ కాకినాడ రూరల్‌ కో–ఆర్డినేటర్, కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో టీడీపీ నుండి 50 మందికి పైగా కార్యకర్తలతో జమ్మలమడక నాగమణి పార్టీలో శనివారం చేరారు. రమణయ్యపేట కన్నబాబు నివాసం వద్ద గైగోలుపాడుకు చెందిన ఆమె ఆధ్వర్యంలో వారికి కన్నబాబు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. నాగమణితోపాటు మహిళా నాయకులు మట్టపర్తి శైలజ, రాయుడు సీత, సుభద్ర, పాలిక లక్ష్మి, పాలిక లోవ, కరుణ, లక్ష్మి, నాగమణితోపాటు కార్యకర్తలు పార్టీలో చేరారు. కార్యక్రమంలో కురసాల సత్యనారాయణ, పార్టీ రూరల్‌ మండ ల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ, సీనియర్‌ నాయకులు గీసా ల శ్రీను, గాలిదేవర బాలాజీ, జం గా గగారిన్, కర్రి చక్రధర్, సిద్దా శివాజీ, పిల్లి నాగు పాల్గొన్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top