గల్లా జయదేవ్‌ అనుచరుల వీరంగం.. | TDP Activists Attacked On YSRCP Activist | Sakshi
Sakshi News home page

గల్లా జయదేవ్‌ అనుచరుల వీరంగం..

Jul 20 2019 10:06 PM | Updated on Jul 20 2019 10:18 PM

TDP Activists Attacked On YSRCP Activist  - Sakshi

సాక్షి, గుంటూరు : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై కత్తులతో దాడి చేస్తూ వీరంగం సృష్టించారు. వివరాలు.. వైఎస్సార్‌సీపీ కార్యకర్త అక్రమ్‌పై.. టీడీపీ కార్యకర్తలు దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఆటోనగర్‌లో చోటుచేసుకుంది. 

గుంటూరు ఎంపీ గల్లాజయదేవ్‌ అనుచరులు హబ్బీర్‌, ఫిరోజ్‌, గఫూర్‌, ఇంతియాజ్‌, రియాజ్‌లు వైఎస్సార్‌సీపీ కార్యకర్త అక్రంను అంతమెందించడానికి ప్రయత్నించగా.. ఆయన తృటిలో తప్పించుకున్నాడు. కత్తులతో మెడపై దాడి చేయడానికి ప్రయత్నించగా అక్రం తప్పించుకునే క్రమంలో భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అక్రమ్‌ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement