తెలంగాణ రాష్ర్టం ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడంతో మనస్తాపానికి గురైన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం పిన్నదరికి చెందిన డిగ్రీ విద్యార్థి సాకే రవికుమార్ (19) గురువారం అర్ధరాత్రి ఆత్మహత్యాయత్నం చేశాడు.
తాడిమర్రి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ర్టం ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడంతో మనస్తాపానికి గురైన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం పిన్నదరికి చెందిన డిగ్రీ విద్యార్థి సాకే రవికుమార్ (19) గురువారం అర్ధరాత్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు... రవికుమార్ మూడేళ్ల వయసులోనే తల్లిదండ్రులు ఓబుళమ్మ, సాకే కుళ్లాయప్ప అనారోగ్యంతో మరణించారు.
అప్పటి నుంచి గ్రామంలోని పిన్నమ్మ రామకృష్ణమ్మ ఇంటిలో ఉంటూ చదువుకుంటున్నాడు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి స్నేహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసేవాడు. ఈ క్రమంలో కేంద్ర కేబినెట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి గురువవారం నోట్‌కు ఆమోదం తెలపడంతో తీవ్ర మనోవేదనకు గురై గురువారం అర్ధరాత్రి మిద్దెపెకైక్కి పురుగుల మందు తాగాడు. మందు ప్రభావంతో విలవిలలాడుతూ అరవలేక మందు డబ్బాను కిందకు విసిరేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు.