చంద్రబాబుపై టీ లాయర్ల ఫిర్యాదు | T Lawyers JAC files complaint on AP CM | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై టీ లాయర్ల ఫిర్యాదు

May 30 2015 2:51 PM | Updated on Sep 4 2018 5:16 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ లాయర్ల జేఏసీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ లాయర్ల జేఏసీ శనివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గండిపేటలో జరిగిన మహానాడులో చంద్రబాబు.. ప్రజలచేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 1951 యాక్ట్ ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement