ఆ ప్రచారం అవాస్తవం.. పుకార్లు నమ్మొద్దు..  | Suryanarayana Demanded Government Take Action Against False Propagandists | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికే అసత్య ప్రచారం

Jul 13 2020 6:02 PM | Updated on Jul 13 2020 6:08 PM

Suryanarayana Demanded Government Take Action Against False Propagandists - Sakshi

సాక్షి, విజయవాడ: ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుండి 57 ఏళ్లకు ప్రభుత్వం తగ్గిస్తుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ తెలిపారు. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పుకార్లు నమ్మొద్దని ఉద్యోగులకు ఆయన విజ్ఞప్తి చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఇటువంటి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వివాదం సృష్టించే కుట్రగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసిన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement