క్రికెట్ పోటీల్లో సన్‌వారియర్స్, సత్తుపల్లి జట్ల విజయం | Sun Warriors,sattupalli teams winners in cricket | Sakshi
Sakshi News home page

క్రికెట్ పోటీల్లో సన్‌వారియర్స్, సత్తుపల్లి జట్ల విజయం

Nov 30 2013 5:43 AM | Updated on Sep 2 2017 1:08 AM

ఖమ్మం పట్టణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రికెట్ పోటీల్లో శుక్రవారం సన్ వారియర్స్, సత్తుపల్లి జట్లు విజయం సాధించాయి.

 ఖమ్మం వైరా రోడ్, న్యూస్‌లైన్: ఖమ్మం పట్టణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రికెట్ పోటీల్లో శుక్రవారం సన్ వారియర్స్, సత్తుపల్లి జట్లు విజయం సాధించాయి. మొదట సన్ వారియర్స్, మధిర ఎస్‌ఆర్‌కేటీ జట్ల మధ్య జరగ్గా, సన్‌వారియర్స్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన మధిర జట్టు 14 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేయగా, సన్ వారియర్స్ జట్టు 13 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసి విజయం సాధించింది. మధ్యాహ్నం నేలకొండపల్లి, సత్తుపల్లి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సత్తుపల్లి జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌చేసిన నేలకొండపల్లి జట్టు 14 ఓవర్లలో 57 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం సత్తుపల్లి జట్టు 13.5 ఓవర్లలో 58 పరుగులు చేసి విజయం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement