స్కూల్ వ్యాన్ బోల్తా: విద్యార్థులకు స్వల్ప గాయాలు | Students minor injured in school van accident | Sakshi
Sakshi News home page

స్కూల్ వ్యాన్ బోల్తా: విద్యార్థులకు స్వల్ప గాయాలు

Aug 14 2013 9:39 AM | Updated on Sep 15 2018 5:57 PM

తిమ్మాపూర్ మండలం అలగనూరు వద్ద గౌతమి స్కూల్ వ్యాన్ బుధవారం ఉదయం బోల్తా పడింది.

తిమ్మాపూర్ మండలం అలగనూరు వద్ద గౌతమి స్కూల్ వ్యాన్ బుధవారం ఉదయం బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు.  అయితే స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను వ్యాన్ నుంచి బయటకు తీశారు. అనంతరం వారిని ప్రాధమిక చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

డ్రైవర్ అతివేగమే ఆ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు. ఆ ఘటనలో డ్రైవర్, క్లీనర్ కూడా స్వల్ప గాయాపడ్డారు. వారు కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాన్ బోల్తా పడటంతో రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. దాంతో ట్రాఫిక్ పోలీసులు రంగప్రవేశం చేసి వ్యాన్ను రహదారిపై నుంచి పక్కకు తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement