కర్నూలు జిల్లా పైడాల మండల కేంద్రంలోని పదో పరీక్ష కేంద్రంలో అస్వస్థతకు గురైన విద్యార్థిని సెలైన్‌తోనే పరీక్ష రాసింది.
పైడాల : కర్నూలు జిల్లా పైడాల మండల కేంద్రంలోని పదో తరగతి పరీక్ష కేంద్రంలో అస్వస్థతకు గురైన విద్యార్థిని సెలైన్‌తోనే పరీక్ష రాసింది. పడమర ప్రాతకోటకు చెందిన శైలజ గురువారం పైడాలలోని హైస్కూల్ కేంద్రంలో హిందీ పరీక్ష రాసేందుకు వచ్చింది. అకస్మాత్తుగా వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెకు వైద్య సిబ్బంది పరీక్షలు చేసి సెలైన్ పెట్టారు. దీంతో శైలజ సెలైన్ తోనే పరీక్ష రాయటం కొనసాగించింది.