విద్యార్థిని కిడ్నాప్ | Student escapes safely from kidnappers | Sakshi
Sakshi News home page

విద్యార్థిని కిడ్నాప్

Nov 8 2013 3:46 AM | Updated on Sep 2 2017 12:23 AM

కిడ్నాపర్ల చెర నుంచి ఓ బాలిక తప్పించుకుని ఇంటికి చేరింది. ఈ సంఘటన మండల పరిధిలోని నాగాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

మెదక్ రూరల్, న్యూస్‌లైన్ : కిడ్నాపర్ల చెర నుంచి ఓ బాలిక తప్పించుకుని ఇంటికి చేరింది. ఈ సంఘటన మండల పరిధిలోని నాగాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి కథనం మేరకు.. ‘నా పేరు సంతోష. నాయన పేరు చింతకింది సాయిలు, అమ్మ పేరు లక్ష్మి. స్థానిక జిల్లా ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నా. బుధవారం బడికి పోలేదు. సాయంత్రం 6.30 గంటల సమయంలో స్నేహితురాలు వద్ద నోట్ బుక్ తెచ్చుకునేందుకు వెళ్లా. అంతులోనే ఇరువురు గుర్తు తెలియని వ్యక్తులు హెల్మెట్లు ధరించి ఓ అడ్రస్ చెప్పాలని కోరారు. నాకు తెలియదని చెప్పా.
 
 అంతలోనే వారిలో ఒకరు ఓ చిన్న డబ్బాను తీసి నా ముక్కు వద్ద పెట్టారు. దాని వాసన పీల్చడంతో స్పృహ కోల్పోయా. తరువాత స్పృహ రాగానే చూడగా రోడ్డు మీద పడి  ఉన్నా. పక్కన చూడగా బైక్ అదుపు తప్పి కిందకు పడింది. ఒకరు బైక్ వద్ద ఉండగా మరొకరు ఫోన్‌లో మాట్లాడుతూ.. ఓ పిల్లను పట్టుకు వస్తున్నామంటూ చెబుతున్నాడు. నన్ను ఎవరో ఎత్తుకెళుతున్నారని గమనించి పరుగులు పెట్టా.. సమీపంలో ఓ వ్యక్తి పంట పొలాల నుంచి సుల్తాన్‌పూర్‌కు వస్తున్నాడు. తనను చూసి ఎందుకు పరుగెడుతున్నావంటూ ప్రశ్నించాడు. తనకు విషయాన్ని వివరించా. ఇతడిని చూసి కిడ్నాపర్లు పారిపోయాడు. అక్కడి నుంచి సుల్తాన్‌పూర్, నాగాపూర్‌కు వచ్చి విషయాన్ని తల్లిదండ్రులకు వివరించా. అప్పటికే నా జుట్టు, ముక్కు పుల్ల లేదు’. అని చెప్పింది. విద్యార్థి తల్లిదండ్రులు సాయిలు, లక్ష్మిలు మాట్లాడుతూ  విషయాన్ని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement