కడపలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థినుల మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పొలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు.
విజయనగరం: కడపలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థినుల మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పొలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. బుధవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రికి చెందిన విద్యాసంస్థల్లో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలతో కుమ్మక్కైన ప్రభుత్వం విద్యార్థుల బాగోగులు గాలికి వదిలేసిందన్నారు.