breaking news
veerabhadra swami
-
ముళ్లపొదల్లో కాకతీయ శిల్పాలు
సాక్షి, హైదరాబాద్: కాకతీయ కాలానికి చెందిన అరుదైన వీరభద్రుడి విగ్రహం ఇది. నాగర్‌కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉమామహేశ్వర దేవాలయం సమీపంలో ఇలా ఎన్నో విగ్రహాలు మట్టిపాలై ఉన్నాయి. వీటిని చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. ఉమామహేశ్వర దేవాలయంలో 1320లో వేయించిన ప్రతాపరుద్రుని శాసనం, 14వ శతాబ్దినాటి శిల్ప సోదరులు పెద శరభయ్య, చిన శరభయ్యలు దేవాలయంలోని పార్వతి, చెన్నకేశవ, మహిషాసుర మర్ధిని, వీరభద్ర, నందికేశ్వరుల విగ్రహాలను చెక్కారని, వాటిని సదానంద స్వామి అనే వ్యక్తి ప్రతిష్టించారని రాసి ఉందన్నారు. కొన్ని విగ్రహాలు ఆలయ మండపంలో ఉండగా, గల్లంతైన వీరభద్ర, నంది విగ్రహాలు ఈ ముళ్లపొదల్లో కనిపించాయన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థినుల మృతి
విజయనగరం: కడపలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థినుల మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పొలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. బుధవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రికి చెందిన విద్యాసంస్థల్లో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలతో కుమ్మక్కైన ప్రభుత్వం విద్యార్థుల బాగోగులు గాలికి వదిలేసిందన్నారు.