తొమ్మిదో తరగతిలోనే ప్రేమ.. ఏం చేసింది? | student committed to suicide with love failure | Sakshi
Sakshi News home page

తొమ్మిదో తరగతిలోనే ప్రేమ.. ఏం చేసింది?

Jul 22 2017 9:09 AM | Updated on Nov 6 2018 8:08 PM

తొమ్మిదో తరగతిలోనే ప్రేమ.. ఏం చేసింది? - Sakshi

తొమ్మిదో తరగతిలోనే ప్రేమ.. ఏం చేసింది?

సినిమాల ప్రభావం సమాజంపై చాలా ఉంది.

వినుకొండ రూరల్‌: సినిమాల ప్రభావం సమాజంపై చాలా ఉంది. సినిమాల్లో చూపించే చిన్నపిల్లల ప్రేమ నుంచి పెద్దలు చేసే హత్యల వరకూ ప్రతిదీ ప్రేరేపితంగానే జరుతున్నాయి. ప్రేమకు వయస్సు అవసరం లేదంటారు. చిన్న వయస్సులో కలిగే ఆకర్షణలను ప్రేమనుకుంటారు విద్యార్థులు. చివరకి ఆప్రేమ(ఆకర్శణ) విఫలమై నూరేళ్ల జీవితాన్ని ఆత్మహత్య చేసుకొని అర్థాంతరంగా ముగిస్తారు. అలా ప్రేమించిన వాడికి వివాహాం నిశ్చయమైందని ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వినుకొండ రూరల్‌ మండలంలోని నడిగడ్డ లో శుక్రవారం చోటు చేసుకుంది.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన అంగటి రాజు, లక్ష్మీల కుమారై అనూష(17) ప్రేమ విఫలం కావడంతో మనస్థాపంతో బలవన్మరణం చెందింది. మృతురాలు స్థానిక జిల్లా పరిషత్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి పోగుల రవికి అనూషకు గత ఏడాది నుంచి పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. అనూష ప్రేమ విషయం బయటకు పోక్కడంతో తల్లిదండ్రులు ఇద్దరిని మందలించి అనూష చదువు మాన్పించారు. అనూష తల్లిదండ్రులు సంచార వ్యాపారం రీత్యా ఇంటి వద్ద ఉండరు. రవికి వేరే అమ్మాయితో వివాహా నిశ్చయమైనట్లు తెలుసుకున్న అనూష కలత చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. బంధువులు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. అనూష తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement