ఛైర్‌పర్సన్‌ ఇస్తానని మోసం.. ఆర్యవైశ్యులకు టీడీపీ ద్రోహం | Vinukonda MLA deceived the Arya Vysya community by promising Municipal Chairperson | Sakshi
Sakshi News home page

ఛైర్‌పర్సన్‌ ఇస్తానని మోసం.. ఆర్యవైశ్యులకు టీడీపీ ద్రోహం

Oct 19 2026 11:14 AM | Updated on Oct 19 2026 11:38 AM

Vinukonda MLA deceived the Arya Vysya community by promising Municipal Chairperson

సాక్షి, పల్నాడు: టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీరుపై ఆర్యవైశ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినుకొండ మున్సిపల్ ఛైర్‌ పర్సన్‌ స్థానం ఆర్యవైశ్యులకు కేటాయిస్తామని ఇప్పుడు మాట మార్చారని వాపోతున్నారు. దీంతో ఎమ్మెల్యేతో సమావేశంలో ఆర్యవైశ్య నేతలు అర్థాంతరంగా వెళ్లిపోయారు.

వివరాల్లోకి వెళితే... ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ స్థానం ఆర్యవైశ్యులకే ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఛైర్మన్‌ అభ్యర్థిపై ఆర్యవైశ్యలతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. అయితే అంతలోనే మాటమార్చి ఛైర్మన్‌ అభ్యర్థిగా మరోకరితో ఎమ్మెల్యే నామినేషన్ వేయించారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై ఆర్యవైశ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య సంఘం నుంచి రెబల్‌ అభ్యర్థిగా నగేష్‌తో నామినేషన్‌ వేయించారు.

ఇదీ చదవండి: మా అన్నపై పోటీ చేస్తావా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement