నిఘా నేత్రం | strong observation | Sakshi
Sakshi News home page

నిఘా నేత్రం

Feb 15 2014 1:44 AM | Updated on Sep 2 2017 3:42 AM

సీసీ టీవీల వ్యవస్థ ఏర్పాటుతో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు డీటీసీ శ్రీకృష్ణవేణి తెలిపారు.

కడప అర్బన్, న్యూస్‌లైన్ :  సీసీ టీవీల వ్యవస్థ ఏర్పాటుతో  మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు డీటీసీ శ్రీకృష్ణవేణి తెలిపారు. శుక్రవారం ఆమె తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కడప, ప్రొద్దుటూరు కార్యాలయాల్లో 8 కెమెరాల సీసీ టీవీ వ్యవస్థ ఏర్పాటుచేశామన్నారు.
 
 మిగతా నాలుగు కార్యాలయాల్లో నాలుగు కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామన్నారు.   వాహనదారులు తమ లెసైన్సుల కోసం, ఆర్‌సీల కోసం  నేరుగా సంప్రదించవచ్చున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement