తపాలా ఉద్యోగుల సమ్మె. | strike to postoffice employee | Sakshi
Sakshi News home page

తపాలా ఉద్యోగుల సమ్మె.

Feb 19 2014 2:28 AM | Updated on Sep 2 2017 3:50 AM

తపాలా ఉద్యోగుల  సమ్మె.

తపాలా ఉద్యోగుల సమ్మె.

తమ సమస్యలను పరిష్కారించాలని కొరుతూ తపాలా శాఖ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు.

 తపాలా ఉద్యోగుల  సమ్మె.
 నిజాంసాగర్,  :

తమ సమస్యలను పరిష్కారించాలని కొరుతూ తపాలా శాఖ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు.
మంగళవారం మండల కేంద్రాలోని సబ్ పోస్టాపీసు వద్ద తపా లా ఈడీ ఉద్యోగులు ధర్నా చేశారు.

ఈ సందర్బంగా ఈడీ ఉద్యోగుల సంఘం మండలనాయకుడు భూమయ్య మాట్లాడుతూ జీడీఎస్ ఉద్యోగులకు సివిల్ సర్వంట్ హోదా కల్పించాలన్నారు. ఉద్యోగులకు ఎటువంటి పరీక్ష లేకుం డా ప్రమోషన్ కల్పించాలన్నారు. 25 శాతం ఎం టీఎన్ ఖాళీలను అవుట్ సోర్స్ ద్వారా భర్తీ చేయడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జీడీఎస్ ఉద్యోగులకు 50  శాతం డీఏను మూల వేతనంతో కలపాలన్నారు. పార్ట్‌టైం, కండిం జెంట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసి, సవరించి న వేతనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశా రు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల తపాలా ఉద్యోగులు శరవణ్, బాలయ్య, శరవన్, రహీం, యూసూబ్, నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
 జుక్కల్: మండల తపాలా కార్యాలయంలో ఆ శాఖ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. బీపీఎంలు వారి కింది సిబ్బంది మంగళవారం సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీపీఎంలు విశ్వనాథ్, సమద్ మాట్లాడుతూ బీపీఎంలను కింది సిబ్బందిని జీడీఎస్‌లో కొనసాగేలా చూడాలని అన్నారు. డీఏను పెంచాలని డిమాండ్ చేశారు. బీపీఎంలకు, కింది సిబ్బం దికి సివిల్ హోదా కల్పించాలని ఏడో వేతనం వర్తించేలా చూడాలని అన్నారు. సీనియర్, జూనియర్లకు జీడీఎస్‌లోకి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీపీఎంలు శ్రీను, వీరేందర్, రాజేందర్, రవి, గౌస్ పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement