'పోలీసుల సాయంతో విద్యార్థుల తనిఖీ' | stage set for ap eamcet | Sakshi
Sakshi News home page

'పోలీసుల సాయంతో విద్యార్థుల తనిఖీ'

May 7 2015 3:45 PM | Updated on Mar 23 2019 8:57 PM

పరీక్ష  రాస్తున్న విద్యార్థులు(ఫైల్) - Sakshi

పరీక్ష రాస్తున్న విద్యార్థులు(ఫైల్)

ఎంసెట్ పరీక్ష నిర్వహణకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు.

కాకినాడ: ఎంసెట్ పరీక్ష నిర్వహణకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు. మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. మెడికల్ పరీక్షా కేంద్రాల వద్ద సెల్ ఫోన్ జామర్లు పెట్టనున్నట్టు వెల్లడించారు.

అనుమానిత విద్యార్థులను అవసరమైతే పోలీసుల సాయంతో తనిఖీ చేస్తామని చెప్పారు. ఇంజనీరింగ్ విభాగానికి 328, మెడికల్ విభాగానికి 163 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఏపీతో పాటు హైదరాబాద్ లో 2,55, 409 మంది విద్యార్థులు ఎంసెట్ రాయబోతున్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement