శ్రీశైలం డ్యాం ను సందర్శించిన కృష్ణా రివర్‌బోర్డు కార్యదర్శి | srisailam krishna river RK guptha | Sakshi
Sakshi News home page

శ్రీశైలం డ్యాం ను సందర్శించిన కృష్ణా రివర్‌బోర్డు కార్యదర్శి

Aug 22 2015 11:56 PM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైలం డ్యాం ను సందర్శించిన కృష్ణా రివర్‌బోర్డు కార్యదర్శి - Sakshi

శ్రీశైలం డ్యాం ను సందర్శించిన కృష్ణా రివర్‌బోర్డు కార్యదర్శి

శ్రీశైలం జలాశయాన్ని శనివారం కృష్ణా రివర్‌బోర్డు కార్యదర్శి ఆర్‌కె గుప్తా సందర్శించారు.

శ్రీశైలం ప్రాజెక్టు(కర్నూలు): శ్రీశైలం జలాశయాన్ని శనివారం కృష్ణా రివర్‌బోర్డు కార్యదర్శి ఆర్‌కె గుప్తా సందర్శించారు. సాధారణ పరిశీలనలో భాగంగా ఆయన జలాశయాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీటి లభ్యత, వర్షాభావ పరిస్థితులు, గ్యాలరీ పనులు, ప్రస్తుతం డ్యాం వద్ద జరుగుతున్న వార్షిక మెయింటెనెన్స్ పనులను ఆయన పరిశీలించారు.

పరిశీలన అనంతరం శ్రీశైల జలాశయానికి సంబంధించిన ఇంజనీర్లతో ఆయన సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. కార్యదర్శి ఆర్‌కె గుప్తతో పాటు చీఫ్‌ఇంజనీర్ చిట్టిబాబు, ఎస్‌ఈ రాంబాబు, ఈఈ మాణిక్యాల రావు, ఇతర ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement