కాలినడకన తిరుమలకు ఎమ్మెల్యే దుద్దుకుంట

Sridhar Reddy, an MLA Who Visited Venkanna Swamy on Foot - Sakshi

పుట్టపర్తి అర్బన్‌: పుట్టపర్తి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కాలినడకన తిరుమలకు వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయన సతీమణి అపర్ణ, కుటుంబ సభ్యులు కలిసి తిరుమలకు మెట్ల మార్గం గుండా కాలినడకన వెళ్లినట్లు చెప్పారు. శనివారం ఉదయం స్వామి వారిని దర్శించుకొని తిరుగు ప్రయాణమైనట్లు తెలిపారు.  వేంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులు, ప్రజల దీవెనలతో అత్యధిక మెజార్టీ సాధించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. పుట్టపర్తి అభివృద్ధికి స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్లు తెలియజేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top