breaking news
mla sridhar reddy
-
Nellore: మేయర్ పీఠంపై కుట్రలు
నెల్లూరు (బారకాసు): నెల్లూరు మేయర్ పీఠంపై కన్నేసిన మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తమ మార్కు రాజకీయానికి తెర లేపారు. మేయర్‌పై అవిశ్వాసం పెట్టడానికి సన్నాహాలు ప్రారంభించారు. సోమవారం కలెక్టర్‌కు అవిశ్వాసానికి నోటీసును అందించనున్నారు. వాస్తవానికి నెల్లూరు నగర పాలక సంస్థకు 2021లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 54 డివిజన్లలో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే 12, 53 డివిజన్ల నుంచి మాత్రమే ఇద్దరు గిరిజన సామాజిక వర్గాలకు చెందిన మహిళలు ఎన్నికయ్యారు. మేయర్ పదవి గిరిజన మహిళకు రిజర్వ్ కావడంతో అప్పట్లో వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వర్గంలోని 12వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన పోట్లూరు స్రవంతిని మేయర్‌గా ఎన్నుకున్నారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి 2023లో వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు. గతేడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో రాజకీయ వ్యూహాలు ప్రారంభించారు. టీడీపీ మార్కు రాజకీయం కోసమే.. కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగి నాలుగేళ్లు గడిచాయి. పట్టుమని 10 నెలల కాలం కూడా లేదు. ఈ తరుణంలో మేయర్ పీఠంపై టీడీపీ మార్కు రాజకీయానికి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి తెరతీశారు. వాస్తవానికి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 54 డివిజన్లు ఉంటే.. అన్ని డివిజన్లను వైఎస్సార్సీపీ కైవశం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఇక సార్వత్రిక ఎన్నికల తర్వాత మారిన రాజకీయాల నేపథ్యంలో కొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన రెండో డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నికల సమాయానికి దాదాపు 42 మంది కార్పొరేటర్లు పచ్చ కండువాలు వేసుకొని టీడీపీ కార్పొరేటర్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే వీరంతా సాంకేతికంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుగానే కొనసాగుతున్నారు. కొంత కాలంగా తటస్థంగా ఉన్న మేయర్ స్రవంతి దంపతులు ఇటీవల వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సన్నిహితంగా ఉండడం, తాను వైఎస్సార్సీపీనే అని బహిరంగంగా చెప్పడంతో జీరి్ణంచుకోలేకపోయిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అసహనంతో రగిలిపోతున్నారు. ఆమెను ఇకపై మేయర్‌గా కొనసాగనివ్వ కూడదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో నెల్లూరు సిటీ, రూరల్ పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసి మేయర్‌పై అవిశ్వాసానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతోపాటు కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు 54 డివిజన్లు ఉండగా వీటిని 71 డివిజన్లుగా విభజించాలని ప్రాథమికంగా విస్తరణ సరిహద్దులు కూడా నిర్ణయించారు. కేవలం రెండు.. మూడు రోజుల్లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. కార్పొరేషన్ లో డివిజన్లు పెరగడంతో రాజకీయ ఆశావహులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేడు అవిశ్వాస తీర్మానం నోటీస్ నగర పాలక సంస్థ పరిధిలోని సిటీ, రూరల్ నియోజకవర్గాలకు సంబంధించిన టీడీపీ కార్పొరేటర్లందరూ సోమవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుని మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీస్‌ను అందజేయనున్నారని తెలిసింది. 15 రోజుల్లోపు సమావేశం నిర్వహించి మేయర్‌గా కొనసాగుతున్న స్రవంతిని గద్దె దించాలని కలెక్టర్‌కు నోటీసులు ఇవ్వనున్నారు. దేవరకొండకు ఇస్తారా..?ప్రత్యేకాధికారుల పాలన పెడతారా..? 54 డివిజన్లలో ప్రస్తుతం 12 మంది కార్పొరేటర్లు మాత్రమే వైఎస్సార్సీపీలో కొనసాగుతున్నారు. మిగతా 42 మంది టీడీపీలో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మేయర్‌పై అవిశ్వాసం పెడితే నెగ్గే అవకాశం ఉంది. అయితే వీరిలో 53వ డివిజన్ నుంచి గెలిచిన దేవరకొండ సుజాత ఒక్కరే గిరిజన మహిళగా ఉన్నారు. అవిశ్వాసం తర్వాత తిరిగి మేయర్ ఎన్నిక నిర్వహిస్తే అవకాశం ఒక్క సుజాతకే ఉంది. అయితే కార్పొరేషన్ ఎన్నికలకు కేవలం 10 నెలలు కూడా లేకపోవడం, అవిశ్వాసం నెగ్గితే.. ఖాళీ అయ్యే మేయర్ స్థానానికి మళ్లీ ఎన్నిక జరగాలంటే.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నెలల్లోనే పదవీ కాలం పూర్తయ్యే పదవికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు తక్కువే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గిరిజన సామాజిక వర్గానికి 40 ఏళ్ల తర్వాత దక్కిన ఈ గౌరవాన్ని టీడీపీ స్వార్థ రాజకీయాలతో మసకబార్చేందుకు సిద్ధమైంది. గిరిజన పీఠాన్ని ప్రస్తుతం డిప్యూటీ మేయర్‌గా కొనసాగుతున్న వ్యక్తికి ఇన్చార్జి మేయర్‌కు కట్టబెట్టాలని వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.టీడీపీలో చేరాలంటూ ఒత్తిళ్లు.. ఆరోపణలు, కేసులు మేయర్ స్రవంతితోపాటు మరికొందరు కార్పొరేటర్లపై ఒత్తిళ్లు, ఆరోపణలు, వేధింపులు, అక్రమ కేసులకు ఎమ్మెల్యేలు తెగబడడంతో దిక్కుతోచని స్థితిలో వీరు వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కోటంరెడ్డికి జైకొట్టారు. అయితే అప్పటికే వీరి మధ్య రాజకీయ అగాధం పెరగడం, వీరు తమ పదవులకు రాజీనామా చేయకపోవడంపై వైఎస్సార్సీపీ నేతలతోపాటు కార్పొరేటర్లు రచ్చ చేయడంతో తమ పదవికి గండం తప్పదని భావించిన మేయర్ దంపతులు తిరిగి వైఎస్సార్సీపీలోనే ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. అయితే వీరు అటు టీడీపీ కార్యక్రమాల్లోనూ, ఇటు వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా తటస్థంగా ఉన్నారు. -
ఒరేయ్ దద్దమ్మ...నీకు దమ్ముంటే రా...నువ్వో నేనో తేల్చుకుందాం
-
పామును రక్షించబోయి ఎమ్మెల్యే కారుకు ప్రమాదం
సాక్షి, పుట్టపర్తి అర్బన్: అడ్డుగా వచ్చిన నాగుపామును రక్షించబోయి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కారుకు ప్రమాదం జరిగిన ఘటన పుట్టపర్తి మండలం కంబాలపర్తి వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. కంబాలపర్తి గ్రామం దాటగానే పొలాల్లో నుంచి పెద్ద నాగుపాము కారుకు అడ్డుగా వచ్చింది. డ్రైవర్ షడన్‌గా బ్రేక్ వేశాడు. వెనుక కాన్వాయ్‌లో వస్తున్న మరో కారు ఎమ్మెల్యే కారును ఢీకొంది. ఎమ్మెల్యే కారుతో పాటు మరో కారు కొంత పాక్షికంగా ధ్వంసమైంది. అయితే కాన్వాయ్‌లో ఉన్న వారెవెరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. చదవండి: (Express Highway: ఏపీకి మరో ఎక్స్‌ప్రెస్ హైవే..) -
కాలినడకన తిరుమలకు ఎమ్మెల్యే దుద్దుకుంట
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కాలినడకన తిరుమలకు వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయన సతీమణి అపర్ణ, కుటుంబ సభ్యులు కలిసి తిరుమలకు మెట్ల మార్గం గుండా కాలినడకన వెళ్లినట్లు చెప్పారు. శనివారం ఉదయం స్వామి వారిని దర్శించుకొని తిరుగు ప్రయాణమైనట్లు తెలిపారు. వేంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులు, ప్రజల దీవెనలతో అత్యధిక మెజార్టీ సాధించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. పుట్టపర్తి అభివృద్ధికి స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్లు తెలియజేశారు. -
చేతులు జోడించి అడుగుతున్నా,ఏదో ఒక విచారణకు ఒప్పుకోండి!
సీఎంకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ‘గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఎంతో అనుభవజ్ఞులు. మిమ్మల్ని సవాల్ చేసేంత అనుభవం గానీ వయసు గానీ నాకు లేదు. నేను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన వాణ్ణి. దేనికైనా ‘సై’ అనే మీరు రాజధాని భూముల వ్యవహారంలో ఎందుకో ‘నై’ అంటున్నారు. ఇందులోని చిదంబర రహస్యమేమిటో నాకు తెలియడం లేదు సీఎంగారూ..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కె.శ్రీధర్‌రెడ్డి సీఎం చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొంటూ ఆయన వినూత్నశైలిలో ముఖ్యమంత్రికి ఈ విజ్ఞప్తి చేశారు. అధికార పక్షమైన టీడీపీ వాదోపవాదాలు చూస్తుంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారో లేక వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ ఉన్నారోనన్న అనుమానం కలుగుతోందన్నారు. ఏపీలోని రాజధాని భూముల దందాలో రికార్డులు కావాలనుకుంటే చిటికెలో పనని, ఆ రికార్డులు ఎక్కడో అమెరికాలోనో, రష్యాలోనో లేవని చెప్పారు. అగ్రిజోన్ల మార్పిడి రికార్డులను చిటికెలో తెప్పించుకోవచ్చన్నారు. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందో అక్కడ కొన్న భూములు రాజధాని ప్రకటనకు ముందు కొన్నవేనని, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి సన్నిహితులు, అనుయాయులకు రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసని, అందుకే ఆ ప్రాంతంలో భూములు కొన్నారని అంటుండగా స్పీకర్ కోడెల మైక్ కట్ చేశారు. దీంతో సభలో విపక్ష సభ్యులు స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం స్పీకర్ తిరిగి మైకు ఇచ్చారు. అప్పుడు శ్రీధర్‌రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఇందుకు సంబంధించిన ఆధారాలు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయని, అందుకే ఆరోపణలు చేస్తున్నామని చెప్పారు. అందువల్ల ఈ భూముల దందాపై జ్యుడిషియల్ లేదా సీబీఐ విచారణకు ఆదేశించి చంద్రబాబు తాను నిష్కళంకుడినని నిరూపించుకోవాలని సూచించారు. తక్షణమే విచారణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. -
అడ్రస్ లేకుండా పోయారు.. గుర్తుంచుకోండి
అసెంబ్లీలో తమకున్న మందబలంతో ప్రతిపక్షం గొంతు నులిమేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. గతంలో ఇంతకంటే పెద్దవే చూశామని, తమిళనాడులో జయలలితను అవమానిస్తే, ఆ తర్వాత ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారని గుర్తుచేశారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. రోజా పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అసమంజసం, అప్రజాస్వామికం అసెంబ్లీ ఆవరణలోకి మాజీ ఎమ్మెల్యేలు కూడా రావచ్చు. ఇటీవల ఓ టీడీపీ కార్పొరేషన్ చైర్మన్ మీడియా పాయింట్లో కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి నేరుగా మైకుల్లోనే అంతుతేలుస్తా అని మాట్లాడారు అచ్చెన్నాయుడు, ఉమా, యనమల అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి నీచాతినీచంగా మాట్లాడారు బోండా ఉమా అయితే అసెంబ్లీలోనే సమాధి కడతామన్నారు బుచ్చయ్య చౌదరి అయితే రోజూ ఏం మాట్లాడతారో తెలియనిది కాదు రోజాను సస్పెండ్ చేయాలంటే , ఆ నియమాలు సీఎంకు, మంత్రులకు వర్తించవా మందబలంతో ప్రతిపక్షాన్ని గొంతు నులిమేస్తున్నారు ప్రభుత్వం తమ దమననీతిని మానుకోవాలి మమ్మల్నందరినీ మూడు నాలుగేళ్లు సస్పెండ్ చేసినా భయపడే ప్రశ్నే లేదు -
అడ్రస్ లేకుండా పోయారు.. గుర్తుంచుకోండి
-
బాబువల్లే 27 మంది బలి
నెల్లూరు: రాజమండ్రి ఘటనలో మృతిచెందిన రాజేశ్వరి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు. సీఎం చంద్రబాబునాయుడు అలసత్వం వల్లే 27 మంది ప్రాణాలు కోల్పోయారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క, నెల్లూరు పరమేశ్వరినగర్‌లో అగ్నిప్రమాద బాధితులకు నెల్లూరు సిటీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆర్థికసాయం అందించారు. ఇక సమ్మెచేస్తున్న మున్సిపల్ కార్మికులకు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి మద్దతు తెలిపారు.


