శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలకు సమైక్య సెగ | Sri krishnadevaraya celebrations postponed at Anantapur district | Sakshi
Sakshi News home page

శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలకు సమైక్య సెగ

Aug 16 2013 10:15 AM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం జిల్లా వ్యాప్తంగా సీమాంధ్ర నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా సీమాంధ్ర నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెనుకొండలో ఈ నెలాఖరున జరగనున్న ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలను వాయిదా వేసినట్లు అనంతపురం ఆర్డీవో శుక్రవారం వెల్లడించారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు ఉత్సవాల ఎప్పుడు జరిగేది త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఆ ఉత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభించవలసి ఉంది.

 

అయితే జిల్లాలో మాత్రం సమైక్యవాదులు చేపట్టిన నిరసనలు శుక్రవారం 17వ రోజుకు చేరుకుంది. ఏపీఎన్జీవో, ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళన ఉవ్వెతున్న సాగుతోంది. జిల్లాలోని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.

 

అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని జాక్టో,రెవెన్యూ, ఉద్యోగులు అనంతపురం నగరంలో రిలే నిరాహర దీక్షలు చేపడుతున్నారు. జిల్లాలోని ధర్మవరం, హిందూపురం, కదిరి, గుంతకల్ పట్టణాల్లో సమైక్య నిరసనలు మిన్నంటుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement