శ్రీచైతన్య స్కూల్‌ సీజ్‌ | Sree Chaitanya English Medium School Seized Nellore | Sakshi
Sakshi News home page

శ్రీచైతన్య స్కూల్‌ సీజ్‌

Jun 22 2019 8:09 AM | Updated on Jun 22 2019 8:10 AM

Sree Chaitanya English Medium School Seized Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు : నవాబుపేటలోని ఎన్సీ బాలయ్యనగర్‌లో నిర్వహిస్తున్న శ్రీచైతన్య ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌కు అనుమతుల్లేవంటూ జిల్లా విద్యా శాఖ అధికారులు శుక్రవారం సీజ్‌ చేశారు. భవన నిర్మాణం పూర్తి కాకుండానే స్కూల్‌ నిర్వహణపై సీజ్‌ చేశామని అధికారులు పేర్కొన్నారు. స్కూల్‌ తలుపునకు నోటీస్‌ను ఎంఈఓ జగదీశ్వర్‌ అంటించారు.

స్కూల్‌ బస్సుల తనిఖీ
విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా పలు విద్యాసంస్థలకు చెందిన బస్సులను శుక్రవారం తనిఖీ చేశారు. విద్యాసంస్థల ప్రారంభంసందర్భంగా విజిలెన్స్‌ ఎస్పీ శ్రీకంఠనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టారు. వివిధ విద్యాసంస్థలకు చెందిన ఆరు బస్సులను తనిఖీ చేసి.. ఎఫ్‌సీ, వాహన కండిషన్, తదితరాలను పరిశీలించారు. విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్లు సుధాకర్‌రెడ్డి, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement