జిల్లాకు రూ.18 వేల కోట్లతో స్పెషల్ ప్యాకేజీ | Special package of Rs 18 crore to the district | Sakshi
Sakshi News home page

జిల్లాకు రూ.18 వేల కోట్లతో స్పెషల్ ప్యాకేజీ

Aug 12 2014 1:19 AM | Updated on Mar 23 2019 9:10 PM

జిల్లాకు కరువు నివారణ పథకం కింద రూ. 18 వేల కోట్ల స్పెషల్ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఈ మేరకు జిల్లాలోని ప్రధానమైన 9 శాఖల నుంచి ప్రతిపాదనలు పంపాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.

చిత్తూరు(టౌన్): జిల్లాకు కరువు నివారణ పథకం కింద  రూ. 18 వేల కోట్ల స్పెషల్ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఈ మేరకు జిల్లాలోని ప్రధానమైన 9 శాఖల నుంచి ప్రతిపాదనలు పంపాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలో శాఖలవారీగా జిల్లా స్థాయిలో సమీక్షలు జరగనున్నాయి. ముందుగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై బుధవారం ఆ శాఖ  సమీక్షించి ప్రతిపాదనలు పంపడానికి సిద్ధమరుుంది. రాష్ట్ర విభజన సందర్భంగా  కేంద్ర ప్రభుత్వం రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలో భాగంగానే ప్రస్తుతం ఈ ప్యాకేజీని జిల్లాకు మంజూరు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
 
ప్యాకేజీ అమలయ్యే శాఖలివీ
ఫారెస్టు, డ్వామా, ఇరిగేషన్,  అగ్రికల్చర్, పశుసంవర్థకశాఖ, గ్రామీణనీటి సరఫరా,  పంచాయతీరాజ్, మత్స్యశాఖ, ఆర్‌అండ్‌బి శాఖల పరిధిలో ఈ స్పెషల్ ప్యాకేజీ పనులు చేపట్టనున్నారు. ఈ ప్యాకేజీ కింద ఒక్కో శాఖకు రూ.2 వేల కోట్లు చొప్పున కేటాయించనున్నారు. వాటర్ రీసోర్స్ సెక్టార్ కింద ఇరిగేషన్ శాఖ పరిధిలో మైనర్, మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. డ్వామా పరిధిలో చెక్‌డ్యాములు, రాక్‌ఫిల్ డ్యామ్‌లు, వాటర్ షెడ్‌ల నిర్వహణ పనులు చేపడతారు. అటవీ శాఖ పరిధిలో అటవీ ప్రాంతాలు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టనున్నారు.
 
వ్యవసాయశాఖ ద్వారా గ్రీన్‌హౌస్‌ల ఏర్పాటు, తక్కువ కాలంలో అధిక దిగుబడినిచ్చే పంటల సాగు, మినీ వ్యవసాయ మార్కెట్లు, సీడ్ ప్రాసెసింగ్ యూని ట్లు, అగ్రికల్చర్ ఇన్‌పుట్ సెంటర్లను నెలకొల్పనున్నారు. పశుసంవర్థక శాఖ ద్వారా  గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్హులైనవారందరికీ ఆవులు, గేదెల పంపిణీ, పశుదాణా తయారీ కేంద్రాల ఏర్పాటు, పశుగ్రాసం నిర్వహణ, కృత్రిమ గర్భోత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేపడతారు. జిల్లాలో ప్రభుత్వ పరిధిలో పాల డెయిరీల ఏర్పాటు, గ్రామాల్లో పాల ఉత్పత్తిని బట్టి పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు, బల్క్‌మిల్క్ చిల్లింగ్ కేంద్రాల నిర్వహణ తదితరాలను చేపడతారు.
 
పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన గ్రామీణరోడ్లు, తారురోడ్లు, సిమెంటు రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణాలను చేపట్టనున్నారు. ఆర్‌అండ్‌బీ  శాఖ పరిధిలో జిల్లాలోని ప్రధానమైన రోడ్ల నిర్వహణ, కొత్తగా రోడ్డు నిర్మాణాలు, ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. గ్రామీణ నీటిసరఫరా శాఖ పరిధిలో గ్రామాల్లో అవసరమైన తాగునీటి బోర్ల తవ్వకాలు, విద్యుత్ మోటార్ల ఏర్పాటు, రక్షిత మంచినీటి ట్యాంకుల నిర్మాణం తదితర పనులు చేస్తారు. మత్స్యశాఖ పరిధిలో ఫిష్ కల్చర్, మార్కెటింగ్ నిర్వహణ తదితర పనులను చేపడతారు.
 
పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ రాక
పంచాయతీరాజ్ శాఖ చేపట్టాల్సిన పనులకు సంబంధించి జిల్లాలోని పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్, లోకల్‌బాడీస్ విభాగాలకు చెందిన అందరు ఈఈలు, డీఈఈలు, ఏఈలతో ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ సీవీ రామ్మూర్తి బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్యాకేజీ కింద చేపట్టనున్న పనులను ఎలా గుర్తించాలి, ఏఏ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అనే అంశాల గురిం చి ఆయన సమీక్షించనున్నారు. చీఫ్ ఇంజనీర్ మంగళవారం ముందుగా కుప్పం వెళ్లి అక్కడి అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement