‘స్పౌస్’ కోటాలో గుర్తించరా? | "Spaus' identified in Kota? | Sakshi
Sakshi News home page

‘స్పౌస్’ కోటాలో గుర్తించరా?

Jul 10 2016 1:41 AM | Updated on Jul 29 2019 5:59 PM

రెండు రాష్ట్రాల మధ్య ప్రభుత్వ వైద్యుల పంపకంలో తమకు అన్యాయం జరుగుతోందని వేరే రాష్ట్రాలకు చెందిన వైద్య దంపతులు వాపోతున్నారు.

రాజమహేంద్రవరం : రెండు రాష్ట్రాల మధ్య ప్రభుత్వ వైద్యుల పంపకంలో తమకు అన్యాయం జరుగుతోందని వేరే రాష్ట్రాలకు చెందిన వైద్య దంపతులు వాపోతున్నారు. వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న వైద్యులందరికీ ఆరు నెలల కిందట తమ తమ రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో నియమించేందుకు కౌన్సెలింగ్ జరిపారు. ఆమేరకు దంపతులైన వైద్యులు తమను ఒకే ప్రాంతంలో నియమించేలా దరఖాస్తులు చేసుకున్నారు. దీనిపై శుక్రవారం జీవో విడుదల చేశారు.ఆప్రకారం ఏపీ, తెలంగాణలకు చెందిన వైద్య దంపతులనే ‘స్పౌస్’ కోటాకు అర్హులుగా పరిగణించారు.

దంపతుల్లో  ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారైతే తప్ప పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇద్దరిలో ఒకరు మరో రాష్ట్రానికి చెందిన వారైతే ‘స్పౌస్’  వర్తించదని ఆ జీవోలోచెప్తోంది. వైద్యవిధాన పరిషత్‌లో సుమారు 900 మంది వైద్యులుండగా వారిలో ‘స్పౌస్’ కోటా వర్తించని 42 జంటలున్నారుు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య వైద్యులను విభజించే పక్రియలో దరఖాస్తుదారుల విన్నపాలు సరైనవేనా, ఎవరెవరిని ఎక్కడ నియమించాలనే దానిపైసోమవారం హైదరాబాదులోని సెక్రటేరియెట్‌లో భేటీ కానున్న కమల్‌నాథన్  కమిటీ తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement