మరణించిన అమ్మను మళ్లీ చూసుకున్నాడు

Sons look back Mother death ded body after one year - Sakshi

తల్లి మరణం తర్వాత భౌతికకాయాన్ని వైద్య పరిశోధనలకు అప్పగింత

ఏడాది తర్వాత మళ్లీ చూసుకునే భాగ్యం

మాతృమూర్తి భౌతికంగా దూరమై సరిగ్గా ఏడాది కాలం..చిత్రపటాలు, అమ్మ పంచిన అమృతమంటి ప్రేమ మాత్రమే ఆమె జ్ఞాపకాలు.. అప్పుడప్పుడు అమ్మ పంచిన ఆప్యాయతలే తలపులు..ఇవీ ఆ కుమారుడికి మిగిలింది. అయితే ఉన్నట్టుండి ఆయనకో తియ్యని కబురు వచ్చింది తమ తల్లి భౌతికకాయం కాటూరు వైద్య కళాశాల్లో కనిపించిందని. ఆ మాట చెప్పిన వెంటనే సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. వెంటనే కళాశాలకు వెళ్లి మాతృమూర్తి భౌతికకాయాన్ని మనసారా చూసుకున్నాడు ఆమె పంచిన ప్రేమ మదిలో మెదలగా చెమర్చిన కళ్లు తుడుచుకుంటూ.

యడ్లపాడు(చిలకలూరిపేట): తల్లి మృతి చెందిన ఏడాది తర్వాత ఆమె భౌతికకాయాన్ని కుమారులు తిరిగి చూసుకోగలిగారు. యడ్లపాడు ఎర్రచెరువులో ఉంటున్న కేతు వెంకాయమ్మ (85) అనారోగ్యంతో గతేడాది డిసెంబర్‌ 20న మృతి చెందింది. ఆమె మరణానంతరం కుమారుడు రామబ్రహ్మం మృతదేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం కాటూరి మెడికల్‌ కళాశాలకు అప్పగించారు.

ప్రదర్శనల వల్ల తల్లిని చూడగలిగారు...
కాటూరి వైద్యశాలలో ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అక్కడకు వెళ్లిన అనేక మంది రామబ్రహ్మం తల్లి భౌతికకాయాన్ని చూసి గుర్తు పట్టారు. వెంటనే కొడుకు రామబ్రహ్మంకు చెప్పడంతో మంగళవారం ఆయన ఆస్పత్రికి వెళ్లి తల్లి భౌతికకాయాన్ని చూసుకున్నారు. ఆనందంతో తల్లి ప్రేమను మరొక్కసారి గుర్తు చేసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top