సీతమ్మ తల్లికి ఉన్న శక్తి సోనియాకు ఉంది: బలరాంనాయక్ | Sonia gandhi is as powerful as Sitamma Talli, says Balaram Nayak | Sakshi
Sakshi News home page

సీతమ్మ తల్లికి ఉన్న శక్తి సోనియాకు ఉంది: బలరాంనాయక్

Nov 26 2013 1:22 AM | Updated on Oct 22 2018 9:16 PM

సీతమ్మ తల్లికి ఉన్నంత శక్తి సోనియాగాంధీకి ఉందని, ఆమె ఏది చేసినా న్యాయబద్ధంగానే చేస్తారని కేంద్రమంత్రి బలరాంనాయక్ అన్నారు.

కేసముద్రం, న్యూస్‌లైన్: సీతమ్మ తల్లికి ఉన్నంత శక్తి సోనియాగాంధీకి ఉందని, ఆమె ఏది చేసినా న్యాయబద్ధంగానే చేస్తారని కేంద్రమంత్రి బలరాంనాయక్ అన్నారు. వరంగల్ జిల్లా కేసముద్రంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పరిపూర్ణమైన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికే సోనియా సమ్మతించారని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర ఏర్పాటు ఆగదన్నారు.

 

తెలంగాణలో మరో 34 నియోజకవర్గాలు పెరగనున్నట్లు చెప్పారు. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ, మానుకోటలో డీఆర్‌డీఎల్ ప్రాజెక్టుతోపాటు, కేంద్రీయ విశ్వవిద్యాలయం నెలకొల్పుతామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement