ప్రేమ వ్యవహారం కోసం తల్లిని చంపిన కొడుకును విశాఖపట్నంలోని గాజువాక పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ప్రేమ వ్యవహారం కోసం తల్లిని చంపిన కొడుకును విశాఖపట్నంలోని గాజువాక పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఆర్థిక లావాదేవీలు, ప్రేమ వ్యవహారం కారణంగానే అతడు ఈ హత్యకు పాల్పడినట్లు డీసీసీ రాంగోపాల్ నాయక్ తెలిపారు.
తన తల్లి వద్ద ఉన్న 7 తులాల బంగారం అమ్మి విదేశాలకు వెళ్లేందుకు రాజశేఖర్ ప్రయత్నించాడని ఆయన చెప్పారు. మృతురాలి కుమార్తె అనుమానంతో తమకు ఫిర్యాదు చేయడంతో రాజశేఖర్ మీద నిఘా పెట్టి అతడిని పట్టుకున్నట్లు ఆయన వివరించారు.