యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు | small fire accident in yaswanthapur express | Sakshi
Sakshi News home page

యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

Jun 5 2015 10:55 PM | Updated on Apr 3 2019 7:53 PM

యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు - Sakshi

యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

బెంగళూరు నుంచి చెన్నై మీదుగా హటియా వెళుతున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం సాయంత్రం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు సమీపంలో పొగలు వచ్చాయి.

నెల్లూరు(మనుబోలు): బెంగళూరు నుంచి చెన్నై మీదుగా హటియా వెళుతున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం సాయంత్రం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు సమీపంలో పొగలు వచ్చాయి. మండలపరిధిలోని చెర్లోపల్లి గేటు సమీపంలోకి రాగానే ఎస్-7 బోగీలో ఎయిర్ లీకేజీ కారణంగా బ్రేక్ జామ్ కావడంతో మంటలొచ్చాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపారు. వెంటనే స్పందించిన రైలు డ్రై వర్ తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement