ఇంటి పునాదిలో వెండి నాణేల కలకలం

Silver Coins Found In East Godavari Coastal Area Village - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలోని యు.కొత్తపల్లి మండలంలోని కోనపాపపేటలో వెండి నాణేలు లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. తీవ్ర ఉంపన్‌ తుపాన్‌ కారణంగా సముద్రంలోని అలల తాకిడికి కోనపాపపేట తీరంలో పలు ఇళ్లు నేల కూలిపోయాయి. అయితే ఓ ఇంటి పునాది గోడ కూలటంతో వెండి నాణేలు బయటకు రాలిపడ్డాయి. ఈ నాణేలు బ్రిటిష్‌ కాలం నాటివని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. (బెంగాల్, ఒడిశాల్లో విధ్వంసం)

ఇక ఈ వెండి నాణేల కోసం స్థానిక ప్రజలు బుధవారం రాత్రి నుంచి తీరంలో వెతకటం ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా పెద్ద ఎత్తున కొంతమందికి వెండి నాణేలు లభ్యమైనట్లు స్థానికులు చెబుతున్నారు. పూర్వం బొందు అమ్మోరియ్య, ఎల్లమ్మ అనే మత్స్యకార కుటుంబం వారు చాలా ధనవంతులని, ఇంటి గోడలో వారు ఈ వెండి నాణేలు దాచిపెట్టి ఉన్నారేమో అని ప్రచారం కొనసాగుతోంది. బయటపడ్డ ఈ వెండి నాణేల విషయంలో ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఇక పశ్చిమబెంగాల్‌లోని దీఘా బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్య బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అతి తీవ్ర తుపానుగా మారిన ‘ఉంపన్’‌ తీరం దాటిన విషయం తెలిసిందే. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top