కోర్కె తీర్చాలంటూ ఎస్‌ఐ ఒత్తిడి | SI Has Molested Woman In Guntur District | Sakshi
Sakshi News home page

పక్క గదిలో జంట.. కోర్కె తీర్చాలంటూ ఎస్‌ఐ ఒత్తిడి

Jun 10 2020 8:51 AM | Updated on Jun 10 2020 12:48 PM

SI Has Molested Woman In Guntur District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: మండల కేంద్రమైన అమరావతిలో ఓ ప్రైవేట్‌ అతిథి గృహంలో మహిళపై ఎస్‌ఐ దాష్టీకం ప్రదర్శించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. తుళ్లూరు డీఎస్పీ వై.శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అమరావతిలోని ఓ ప్రైవేట్‌ అతిథి గృహంలో పెదకూరపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఒక జంట గది అద్దెకు తీసుకుంది. అదే వీధిలోని వేరే అతిథి గృహంలో బస చేసిన ఎస్‌ఐ రామాంజనేయులు, అతని డ్రైవర్‌ ఇది గమనించి పోలీస్‌ రైడ్‌ నిర్వహించారు. వారిద్దరినీ బెదిరించి రూ.10 వేలు డిమాండ్‌ చేశారు. చదవండి: మంచి మాటకు ముందే మరణ వార్త

ఆ యువకుడు రూ.5 వేలకు ఒప్పుకుని తన దగ్గర ఉన్న రూ.3 వేలు ఇచ్చాడు. మిగిలిన రూ.2 వేలు ఏటీఎంలో తీసి ఇవ్వాలంటూ ఎస్‌ఐ ఒత్తిడి చేశాడు. అతని ఫోన్‌ లాక్కుని తన డ్రైవర్‌ను ఇచ్చి ఏటీఎంకు పంపాడు. వారు వెళ్లిన తర్వాత గదిలో ఉన్న మహిళను తన కోర్కె తీర్చాలంటూ ఒత్తిడి చేయగా ఆమె తిరస్కరించింది. ఈ లోపు డబ్బు కోసం ఏటీఎంకు వెళ్లినవారు తిరిగి రావడంతో వారిని వదిలేశారు. ఈ ఘటనపై బాధితులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ వ్యవహారం వెలుగులోకొచ్చింది. పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. చదవండి: అయ్యోరు రాసిన రక్తచరిత్ర

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement