ప్రముఖుల ఇలాకాల్లో ఇతర పార్టీల జెండా | Shocking results for political leaders in their own villages | Sakshi
Sakshi News home page

ప్రముఖుల ఇలాకాల్లో ఇతర పార్టీల జెండా

May 14 2014 2:41 AM | Updated on Aug 10 2018 8:06 PM

జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో పలు పార్టీల ప్రముఖులకు సొంత ప్రాంతాల్లో పరాభవమే మిగిలింది

సాక్షి, హైదరాబాద్: జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో పలు పార్టీల ప్రముఖులకు సొంత ప్రాంతాల్లో పరాభవమే మిగిలింది. ్హ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బరిలో ఉన్న గజ్వేల్ అసెంబ్లీ స్థానం పరిధిలోని జెడ్‌పీటీసీ స్థానం ప్రత్యర్థి తెలుగుదేశం పరమైంది. సోమవారం విడుదలైన మునిసిపల్ ఎన్నికల్లో గజ్వేల్ పురపాలక సంఘం టీడీపీ ఖాతాలో జమ కావడంతో కంగుతిన్న కేసీఆర్ ఈ పరిణామంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడ్డారు. ్హ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ నియోజకవర్గం ఆందోల్‌లో జెడ్‌పీటీసీని టీఆర్‌ఎస్ గెలుచుకుంది. ్హ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్వగ్రామం వరంగల్ ఖిలాషాపూర్‌లో ఎంపీటీసీ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. అక్కడ టీడీపీ విజయం సాధించింది. ్హ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి స్వగ్రామంలో టీఆర్‌ఎస్ విజయబావుటా ఎగరవేసింది. ్హ మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గ్రామంలో కాంగ్రెస్ గల్లంతైంది. ఇక్కడ ఎంపీటీసీ స్థానాన్ని టీఆర్‌ఎస్ దక్కించుకుంది. 
 
 వారెవ్వా!
  •  జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో 
  •  కొన్ని ఆసక్తికర అంశాలు...
  • నిజామాబాద్‌లో టీడీపీ 29 జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయగా, ఒక్క స్థానంలోనూ గెలవలేదు.
  • ఆదిలాబాద్‌లో తెలుగుదేశం పార్టీ 390 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేయగా, 63 స్థానాలు గెలుచుకుంది. అయినా ఒక్క ఎంపీపీ స్థానం కూడా దక్కే అవకాశం లేదు.
  • ఖమ్మంలో టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ స్థానాలకు పో టీయే చేయలేదు. మూడు ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసి, ఒక దానిలో విజయం సాధించింది.
  • కరీంనగర్‌లో టీడీపీ 40 జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేస్తే 1 మాత్రమే వచ్చింది.
  • నల్లగొండలో టీడీపీ 48 జెడ్పీటీసీలకు పోటీ చేస్తే 1 స్థానం మాత్రమే ద క్కింది.
  • తెలంగాణలో కమ్యూనిస్టులకు వచ్చిన 5 జెడ్పీటీసీ స్థానాలూ ఖమ్మం జిల్లాలోనివే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement