అసెంబ్లీలో బాబుది శిఖండి పాత్ర: శోభానాగిరెడ్డి | Shobha Nagi Reddy slams chandrababu Naidu | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో బాబుది శిఖండి పాత్ర: శోభానాగిరెడ్డి

Jan 28 2014 3:51 AM | Updated on Oct 22 2018 5:46 PM

అసెంబ్లీలో బాబుది శిఖండి పాత్ర: శోభానాగిరెడ్డి - Sakshi

అసెంబ్లీలో బాబుది శిఖండి పాత్ర: శోభానాగిరెడ్డి

అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు శిఖండి పాత్ర పోషిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. రాష్ర్ట విభజన బిల్లు విషయంలో బాబు అనుసరిస్తున్న వైఖరిపై వారు మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ నేత శోభానాగిరెడ్డి ధ్వజం
 
 సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు శిఖండి పాత్ర పోషిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. రాష్ర్ట విభజన బిల్లు విషయంలో బాబు అనుసరిస్తున్న వైఖరిపై వారు మండిపడ్డారు.  సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బాలినేని శ్రీనివాసరెడ్డి, కె.శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి, కాటసాని రామిరెడ్డిలతో కలసి శోభానాగిరెడ్డి మాట్లాడారు. ‘‘చంద్రబాబు అసెంబ్లీలో తెలంగాణకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోడియంలోకి పంపిస్తారు. సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రం వారి సీట్లలోనే కూర్చుంటారు. బీఏసీ సమావేశానికి బాబు రాకుండా ఇరు ప్రాంత నేతలను పంపి రెండు వాదనలు చేయిస్తారు. సభలో కూడా నోరు మెదపకుండా బాబు శిఖండిలా వ్యవహరిస్తూ, ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.
 
 అలాంటి వారికి వైఎస్సార్‌సీపీని, జగన్‌ను విమర్శించే అర్హత లేదు. సమైక్య తీర్మానం చేయాలని సభా నిబంధన 77 కింద డిసెంబర్ 16న మేము స్పీకర్‌కు నోటీసు ఇస్తే సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు అవహేళన చేశారు. ఇప్పుడు వారు కూడా మా దారిలోకే వచ్చారు. బిల్లులో లోపాలున్నాయని 43 రోజుల తర్వాత సీఎం కిరణ్‌కు తెలిసిందా? చిత్రమేంటంటే బిల్లుపై ఆయనే సంతకం చేసి అసెంబ్లీకి పంపారు. మరో విచిత్రమేంటంటే కిరణ్ చెప్పేం త వరకు బిల్లులో లోపాలున్నాయని బాబుకు కూడా తెలియకపోవడం. కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్టు కిరణ్, బాబు నడుచుకుంటున్నారు’’ అని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement