జగనన్న జైలులో ఉన్నా జననేత అని నిరూపించుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమె అనంతపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా సప్తగిరి సర్కిల్ భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. సప్తగిరి సర్కిల్ జనంతో నిండిపోయింది. ఎటు చూసినా జనమే జనం. అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.