వ్యభిచార కేంద్రంపై దాడి | Sexual Centre raid | Sakshi
Sakshi News home page

వ్యభిచార కేంద్రంపై దాడి

Mar 12 2016 4:33 AM | Updated on Sep 2 2018 3:44 PM

వేదాయపాళెం కేశవులునగర్‌లోని ఓ వ్యభిచార కేంద్రంపై శుక్రవారం అర్ధరాత్రి ఐదో నగర పోలీసులు దాడిచేశారు.

నెల్లూరు(క్రైమ్): వేదాయపాళెం కేశవులునగర్‌లోని ఓ వ్యభిచార కేంద్రంపై శుక్రవారం అర్ధరాత్రి ఐదో నగర పోలీసులు దాడిచేశారు. నిర్వాహకురాలితో పాటు సెక్స్‌వర్కర్, విటుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు.. మస్తానయ్య, నాగరత్న దంపతులు కొంతకాలంగా వేరుగా ఉంటున్నారు. నాగరత్న ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. కేంద్రంపై ఐదో నగర  పోలీసులు కొద్దిరోజులుగా నిఘా ఉంచారు.

శుక్రవారం అర్ధరాత్రి ఐదో నగర ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు, ఎస్సై విజయ్‌కుమార్ సిబ్బందితో కలిసి దాడిచేశారు. సెక్స్ వర్కర్‌తో పాటు సంతపేట ఈద్గామిట్టకు చెందిన జమాల్, నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విటుడు, నిర్వాహకురాలిపై కేసు నమోదు చేశారు. సెక్స్‌వర్కర్‌ను హోమ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement