వృద్దురాలిపై లైంగిక దాడి | Sexual assault on the elderly | Sakshi
Sakshi News home page

వృద్దురాలిపై లైంగిక దాడి

Dec 6 2015 1:14 PM | Updated on Jul 23 2018 9:13 PM

ఇంట్లో వంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై గుర్తుతెలియని దుండగుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఇంట్లో వంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై గుర్తుతెలియని దుండగుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘోరం చిత్తూరు జిల్లా మదనపల్లె చీకులగుట్టలో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న వృద్ధ మహిళ(64) ఇంట్లో వంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి ఒడి గట్టాడు. ఆమె కేకలు వినిపించి.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాదితురాలిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చికిత్సల అనంతరం ఆమెపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని వైద్యులు నిర్ధరించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement