మానసిక వికలాంగ యువతిపై లైంగిక దాడి | Sexual assault on Mental handicaps | Sakshi
Sakshi News home page

మానసిక వికలాంగ యువతిపై లైంగిక దాడి

Dec 23 2014 3:39 AM | Updated on Oct 9 2018 7:05 PM

మానసిక వికలాంగ యువతిపై లైంగిక దాడి - Sakshi

మానసిక వికలాంగ యువతిపై లైంగిక దాడి

మానసిక వికలాంగురాలైన యువతిపై లైంగికదాడి జరిగిన విషయం ఒంటిమిద్ది..

ఒంటిమిది (కళ్యాణదుర్గం రూరల్) : మానసిక వికలాంగురాలైన యువతిపై లైంగికదాడి జరిగిన విషయం ఒంటిమిద్ది గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై బాధితురాలి తల్లి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. ఆమె కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలు(25) మూడు నెలల క్రితం అశోక్ అనే వ్యక్తి తోట సమీపంలోకి బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో అతడు ఆ యువతిపై లైంగికదాడి జరిపాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచారుుతీ నిర్వహించారు.

ఈ క్రమంలో యువతికి నెల రోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు యువతి గర్భం దాల్చినట్లు సోమవారం నిర్ధారించారు. దీనిపై యువతి తల్లి బంధువులతో కలిసి వెళ్లి అశోక్ ను నిలదీసింది. దీంతో ఆగ్రహించిన అశోక్ యువతి తల్లిపై చేరుచేసుకునే ప్రయత్నం చేశాడు.

భయపడిన యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న అశోక్ పరారీలో ఉన్నాడు. మానసిక వికలాంగ యువతిని చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ జయనాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement