ఏడుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ | Seven Interstate thieves gang arrested at Anathapuram district | Sakshi
Sakshi News home page

ఏడుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Dec 4 2014 3:31 PM | Updated on Jun 1 2018 8:59 PM

జిల్లాలో అంతరాష్ట్ర దొంగలు రెచ్చిపోతున్నారు. అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి దోపిడిలకు పాల్పడుతున్నారు.

అనంతపురం: జిల్లాలో అంతరాష్ట్ర దొంగలు రెచ్చిపోతున్నారు. అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి దోపిడిలకు పాల్పడుతున్నారు. వారిని అడ్డుకునేందుకు యత్నిస్తే చంపడానికి కూడా వెనకాడటలేదు. దాంతో జిల్లా ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. దొంగల ఆగడాలను అరికట్టించేందుకు రంగంలోకి దిగిన పోలీసు యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టింది.

ఈ చర్యల్లో భాగంగా అంతరాష్ట్ర దొంగల ముఠాలో ఏడుగురిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 2.13 లక్షల రూపాయలను, 5వేట కొడవళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement