తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తమతోనే సాధ్యమని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. ఉభయ రాష్ట్రాలను దేశం గర్వించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. పార్టీ నేత డాక్టర్ ఎస్. ప్రకాశ్‌రెడ్డితో కలసి ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తమతోనే సాధ్యమని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. ఉభయ రాష్ట్రాలను దేశం గర్వించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. పార్టీ నేత డాక్టర్ ఎస్. ప్రకాశ్‌రెడ్డితో కలసి ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చి బీజేపీ విశ్వసనీయతను నిరూపించుకుందని, విభజనను ఆపేందుకు కాంగ్రెస్ చివరివరకు డ్రామాలు ఆడిందని చెప్పారు. కాంగ్రెస్‌కు ఉభయ ప్రాంతాల్లోనూ పరాభవం తప్పదన్నారు. హైదరాబాద్‌పై సీమాంధ్రులకూ హక్కుంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండదని చెప్పారు. కాగా, తెలంగాణ సాధించిన తర్వాతే హైదరాబాద్‌లో అడుగుపెడతానన్న మాట నిలుపుకున్నానని ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి చెప్పారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన ఎమ్మెల్యేలు నాగం, యెన్నం శ్రీనివాసరెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం ఘన స్వాగతం లభించింది.