ఏపీఎన్జీవో భవన్‌లో సీమాంధ్ర అడ్వకేట్ల సమావేశం | seemandhra advocates meet in apngo's bhavan | Sakshi
Sakshi News home page

ఏపీఎన్జీవో భవన్‌లో సీమాంధ్ర అడ్వకేట్ల సమావేశం

Aug 29 2013 3:16 PM | Updated on Sep 1 2017 10:14 PM

సీమాంధ్ర న్యాయవాదులు ఏపీఎన్జీవో భవన్ లోగురువారం సమావేశమైయ్యారు.

హైదరాబాద్: సీమాంధ్ర న్యాయవాదులు ఏపీఎన్జీవో భవన్ లో గురువారం సమావేశమైయ్యారు. సెప్టెంబరు 7వ తేదీన హైదరాబాద్ లో చేపట్టనున్న సమైక్యాంధ్ర సభ ఏర్పాటుకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో హైదరాబాద్ లో సభ నిర్వహిస్తామని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు బుధవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర న్యాయవాదులు ఏపీఎన్జీవో భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

 

బుధవారం అశోక్ బాబు మాట్లాడుతూ.. చట్టపరంగానైనా సెప్టెంబర్ 7న సభ నిర్వహించి తీరుతామన్నారు.సభలో అన్ని పార్టీల నేతలు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులే సభలో పాల్గొంటారని  తెలిపారు. హైదరాబాద్ పై అందరికీ సమాన హక్కులున్నాయని, సభ ఏర్పాటుకు తెలంగాణ వాదులు సహకరించాలని ఆయన విజ్క్షప్తి చేశారు. సీమాంధ్రులు హైదరాబాద్ లోల సభ పెడితే తెలంగాణ వాదం దెబ్బతింటుందనే వాదన సరికాదన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల వల్లే మాకు ఈ పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు.
 
 
సీమాంధ్ర కేంద్రమంత్రులు రాజీ నామాలు చేస్తే తెలంగాణ ప్రక్రియపై కేంద్రం ముందుకెళ్లే అవకాశం లేదని, అలాగని వెనక్కి వెళ్లలేదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు చేస్తున్న ఉద్యమం వల్ల రాష్ట్రంలో యథాతథస్థితే ఉంటుందని భావిస్తున్నామని అశోక్‌బాబు తెలిపారు. తృణమూల్, సీపీఎం, అన్నాడీఎంకే తెలంగాణ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.కాగా, సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేయవద్దని మిగిలిన పార్టీలూ కోరుతున్నాయన్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement