'బిల్లుకు అనుకూలమైనా, వ్యతిరేకమైనా అభిప్రాయాలు చెప్పాలి' | seemandhr leaders request all parties should tell their opinion | Sakshi
Sakshi News home page

'బిల్లుకు అనుకూలమైనా, వ్యతిరేకమైనా అభిప్రాయాలు చెప్పాలి'

Jan 7 2014 6:09 PM | Updated on Sep 27 2018 5:56 PM

అసెంబ్లీలో బిల్లుకు అనుకూలమైనా, వ్యతిరేకమైనా అభిప్రాయాల్ని చెప్పాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు.

హైదరాబాద్: అసెంబ్లీలో బిల్లుకు అనుకూలమైనా, వ్యతిరేకమైనా అభిప్రాయాల్ని చెప్పాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు. అన్ని పార్టీలు తమ అభిప్రాయాల్ని తప్పక తెలియజేయాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి నివాసంలో సీమాంధ్రకు చెందిన కొంతమంది నేతలు సమావేశమైయ్యారు. ఈ సమావేశానికి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, గాదె వెంకట రెడ్డి, వట్టి వసంత కుమార్, వీరశివారెడ్డిలు హాజరైయ్యారు.ఈ నెల 10వ తేదీలోగా బిల్లులోని తరగతుల వారీగా సవరణలు ఇవ్వాలని స్పీకర్ కోరిన విషయాన్ని సీమాంధ్ర నేతలు తెలిపారు.

 

టీ.బిల్లుపై చర్చను బహిష్కరిస్తే నష్టపోయే అవకాశం ఉందన్నారు. బిల్లును తిప్పి పంపించడమంటే బిల్లును ఆమోదించినట్లేనని వారు తెలిపారు. క్లాజుల వారీగా చర్చిస్తే ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందన్నారు. బిల్లుపై సవరణలు ఆమోదించలా?లేదా?అనేది రాష్ట్రపతి, పార్లమెంట్ నిర్ణయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement