కీచక టీచర్ అరెస్ట్ | school teacher arrested for sexual assault in srikakulam | Sakshi
Sakshi News home page

కీచక టీచర్ అరెస్ట్

Oct 15 2015 9:12 PM | Updated on Aug 20 2018 4:27 PM

విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కొత్తూరు(శ్రీకాకుళం): విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం సిరిసివాడ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఈ నెల 3న ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినితో ఉపాధ్యాయుడు గవరా ఉమాపతి అసభ్యకరంగా ప్రవర్తించాడు.

దీని గురించి బాలిక తల్లిందండ్రులకు చెప్పడంతో వాళ్లు ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని గురువారం శ్రీకాకుళం జిల్లా కోర్టులో హాజరు పరిచారు.

Advertisement
 
Advertisement
Advertisement