స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థిని మృతి | school bus roll over student died | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థిని మృతి

Dec 10 2015 1:11 AM | Updated on Sep 3 2017 1:44 PM

ప్రైవేట్ స్కూల్ బస్సు పాలకొల్లు బ్రాడీపేట బైపాస్‌రోడ్డులో బుధవారం సాయంత్రం డివైడర్‌ను ఢీకొని బోల్తాపడటంతో యూకేజీ

 పాలకొల్లు టౌన్:ప్రైవేట్ స్కూల్ బస్సు పాలకొల్లు బ్రాడీపేట బైపాస్‌రోడ్డులో బుధవారం సాయంత్రం డివైడర్‌ను ఢీకొని బోల్తాపడటంతో యూకేజీ  విద్యార్థిని నూజర్ల రిషిత(5) మరణించింది. 10మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సన్‌షైన్ స్కూల్ వదిలిన తరువాత పెనుమదం, గుమ్మలూరు, ఆచంట గ్రామాలకు చెందిన సుమారు 20మంది విద్యార్థులతో స్కూల్ బస్సు బుధ వారం సాయంత్రం బయలుదేరింది. పాల కొల్లు బ్రాడీపేట బైపాస్‌రోడ్డుకు వచ్చేసరికి బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో బోల్తాపడింది.
 
  ఆ ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్న యువకులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని బస్సు అద్దాలు పగులగొట్టి విద్యార్థులను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన పాలకొల్లు సబ్బేవారిపేటకు చెందిన రిషితను పాలకొల్లులోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిం ది. డ్రైవర్  బస్సును అతివేగంగా నడపటంతో అదుపుతప్పి ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రైవేట్ వాహన డ్రైవర్ అయిన రిషిత తండ్రి సతీష్, తల్లి దుర్గ ఆసుపత్రికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. వారి దుఃఖాన్ని ఎవరూ ఆపలేకపోయూరు.
 
  ప్రమాదంలో కొండేటి చంద్రకళ (6వతరగతి, ఆచం ట), కర్ని దీపిక (4వ తరగతి, గుమ్మలూరు), బాలం ఆనందకుమార్ (6వ తరగతి, ఆచం ట), బొక్కా తరుణ (6వ తరగతి, ఆచంట), కర్ణి ప్రేమచంద్ (5వ తరగతి, గుమ్మలూరు), కర్ణి మౌనిక (1వ తరగతి, గుమ్మలూరు)కు స్వల్పగాయాలు అ య్యూ యి. వారికి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించిన అనంతరం పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించా రు. రిషిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్టు పట్టణ సీఐ కోలా రజనీకుమార్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆసుపత్రికి వచ్చి రిషిత తల్లిదండ్రులను అనునయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement