పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలి | SC/ST reservation in Promotion | Sakshi
Sakshi News home page

పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలి

Sep 14 2013 12:30 AM | Updated on Sep 15 2018 3:01 PM

పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి రోస్టర్ పాయింట్లు సక్రమంగా అమలు చేయాలని, ప్రమోషన్ షెడ్యూల్‌ను...

సంగారెడ్డి రూరల్, న్యూస్‌లైన్:  పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి రోస్టర్ పాయింట్లు సక్రమంగా అమలు చేయాలని, ప్రమోషన్ షెడ్యూల్‌ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న చలో సంగారెడ్డి కార్యక్రమం చేపడుతున్నట్లు తెలంగాణ పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు లచ్చిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం టీపీఆర్‌టీయూ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సబ్‌కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ డీఈఓ రమేష్ ఉపాధ్యాయుల పట్ల అవలంబిస్తున్న తీరుకు నిరసనగా చలో సంగారెడ్డి కార్యక్రమం చేపడుతున్నామన్నారు. పాఠశాలల్లో విద్యావలంటీర్లు లేక విద్యా వ్యవస్థ కుంటుపడుతుంటే, చిన్న పొరపాట్లకు ఉపాధ్యాయులను బాధ్యులుగా చేస్తూ సస్పెండ్ చేయడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, సంగారెడ్డి మండల అధ్యక్షుడు డీఎన్ మూర్తి, కార్యదర్శులు తుకారాం, కారం అశోక్, రామకృష్ణ, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
 
 చలో సంగారెడ్డిని విజయవంతం చేయాలి
 కల్హేర్: డీఈఓ  వైఖరికి నిరసనగా ఈ నెల 20న చేపట్టనున్న చలో సంగారెడ్డి కార్యక్రమన్ని విజయవంతం చేయాలని పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్, ఏపీటీఎఫ్ జిల్లా బాధ్యుడు గోపినాయక్ ఉపాధ్యాయులను కోరారు. శుక్రవారం  మండల జాక్టో స్టీరింగ్ కమిటీ సమావేశంలో గుండు లక్ష్మణ్, గోపినాయక్ మాట్లడుతూ  ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు రోస్టర్ పద్ధతిలో పదోన్నతి కలిపించాలని  డిమాండ్ చేశారు. సమవేశంలో ఉపాధ్యాయ సంఘాల జాక్టో స్టీరింగ్ కమిటీ మండల కన్వీనర్లుగా సంజీవరెడ్డి, భాస్కర్, అశోక్‌రెడ్డి, మశ్చేందర్, కో కన్వీనర్లుగా నర్సింలు, బాలయ్య, జి.నర్సింలు ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement