మళ్లీ విధుల్లోకి సీపీ సవాంగ్ | Sawang takes charge as Vijayawada Police Commissioner ... | Sakshi
Sakshi News home page

మళ్లీ విధుల్లోకి సీపీ సవాంగ్

Feb 18 2016 10:11 AM | Updated on Sep 3 2017 5:54 PM

మళ్లీ విధుల్లోకి సీపీ సవాంగ్

మళ్లీ విధుల్లోకి సీపీ సవాంగ్

పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ బుధవారం విధులకు హాజరయ్యారు. కమిషనరేట్‌లోని అధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు.

విజయవాడ : పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ బుధవారం విధులకు హాజరయ్యారు. కమిషనరేట్‌లోని అధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. వాస్తవానికి మంగళవారం నుంచే కమిషనర్ విధులకు హాజరుకావాల్సి ఉంది. పుష్కర బందోబస్తుపై డీజీపీ జె.వి.రాముడు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి హాజరుకావాల్సి రావడంతో హైదరాబాద్‌లోనే ఉన్నారు.

వ్యక్తిగత కారణాలపై ఈ నెల 3 నుంచి సవాంగ్ సెలవుపై వెళ్లారు. గత డిసెంబర్‌లోనే వెళ్లాల్సి ఉండగా అనివార్య పరిస్థితుల్లో సెలవు రద్దు చేసుకున్నారు. తిరిగి ఈ నెల మూడు నుంచి సెలవుపై వెళ్లడంతో ఇన్‌చార్జి పోలీసు కమిషనర్‌గా అదనపు డీజీపీ(ఆపరేషన్స్) ఎన్.వి.సురేంద్రబాబు బాధ్యతలు నిర్వర్తించారు. సిట్ ఐజీ మహేష్ చంద్ర లడ్హాతోపాటు డీసీపీలు ఎల్.కాళిదాసు, జి.వి.జీ.అశోక్‌కుమార్ తదితరులు కమిషనర్ సవాంగ్‌ను కలిశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement