సీఎం బాబుకు ముఖ్య కార్యదర్శిగా సతీష్ చంద్ర | satish chandra appointed as chandra babu naidu chief secretary | Sakshi
Sakshi News home page

సీఎం బాబుకు ముఖ్య కార్యదర్శిగా సతీష్ చంద్ర

Nov 3 2014 12:52 AM | Updated on Aug 18 2018 6:18 PM

సీఎం బాబుకు ముఖ్య కార్యదర్శిగా సతీష్ చంద్ర - Sakshi

సీఎం బాబుకు ముఖ్య కార్యదర్శిగా సతీష్ చంద్ర

ఏపీ సీఎం చంద్రబాబుకు ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర నియమితులయ్యారు.

సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుకు ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెసిడెంట్ కమిషనర్‌గాను, అక్కడే సీఎం ముఖ్యకార్యదర్శిగాను సతీష్ చంద్ర వ్యవహరిస్తున్నారు. ఆయనను  సీఎం ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేస్తూ సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమ శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న జి. జయలక్ష్మిని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఏపీ వైద్య, ఆరోగ్య, గృహ, మౌలిక సదుపాయాల సంస్థ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న ఎం. రవిచంద్రను ఎక్సైజ్ కమిషనర్‌గా, చేనేత జౌళి శాఖ డెరైక్టర్‌గా ఉన్న కె.వి. సత్యనారాయణను ఏపీఐఐసీ ఎండీగా బదిలీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement