తండ్రి సంకల్పానికి కుమార్తెల అండదండలు | Sarvepalli MLA Daughters Have Given Their Support To People | Sakshi
Sakshi News home page

తండ్రి సంకల్పానికి కుమార్తెల అండదండలు

Apr 11 2020 8:37 AM | Updated on Apr 11 2020 8:38 AM

Sarvepalli MLA Daughters Have Given Their Support To People - Sakshi

తోడేరులో ఎమ్మెల్యే కాకాణికి ధాన్యాన్ని అప్పగిస్తున్న కుమార్తె, అల్లుడు

సాక్షి, పొదలకూరు : తండ్రి సంకల్పానికి కుమార్తెలు అండదండలు అందించారు. తమ ఇంటి నుంచి కూడా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కోసం ధాన్యాన్ని అందించారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తెలు పూజిత, సుచిత్ర.. అల్లుళ్లు అశ్వంత్‌కృష్ణారెడ్డి, గోపాలకృష్ణారెడ్డి.. మనుమడు శౌర్యవర్ధన్‌రెడ్డిలు శుక్రవారం రూ.1.80 లక్షల విలువైన 12 పుట్ల ధాన్యాన్ని అందజేశారు.

మండలంలోని తోడేరు గ్రామంలో తమ వంతుగా వచ్చిన ధాన్యాన్ని ఎమ్మెల్యేకు అప్పగించి ప్రజాప్రయోజనం కోసం ఆయన చేస్తున్న ధాన్యం సేకరణలో వారు భాగస్వామ్యులయ్యారు. నాయకులు ఏనుగు శశిధర్‌రెడ్డి, పెదమల్లు రమణారెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, తెనాలి నిర్మలమ్మ, మద్దిరెడ్డి రమణారెడ్డి, ఎం.శేఖర్‌బాబు పాల్గొన్నారు. చదవండి: పోలీసు వలయంలో ఆ ప్రాంతాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement