శ్రీ రాఘవేంద్రుల సప్తరాత్రోత్సవాలు | sapta rathrostavalu in mantralayam | Sakshi
Sakshi News home page

శ్రీ రాఘవేంద్రుల సప్తరాత్రోత్సవాలు

Aug 28 2015 9:36 AM | Updated on Sep 3 2017 8:18 AM

కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రాఘవేంద్రస్వామి ఆలయంలో ఏడురోజుల పాటు సప్తరాత్రోత్సవాలను నిర్వహించనున్నట్టు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తెలిపారు.

మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రాఘవేంద్రస్వామి ఆలయంలో ఏడురోజుల పాటు సప్తరాత్రోత్సవాలను నిర్వహించనున్నట్టు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తెలిపారు. శుక్రవారం నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించన్నునారు.

ఆగస్టు 31న మధ్యారాధన సందర్భంగా టీటీడీ పట్టువస్త్రాల సమర్పణ, మహా పంచామృతాభిషేకం, రజత, స్వర్ణ, నవరత్న రథోత్సవాలు జరుపుతారు. సెప్టెంబర్ 1న ఉత్తరారాధన సందర్భంగా మహా రథోత్సవం సంస్కృత పాఠశాల వరకు ఉత్సవ మూర్తి ప్రహాల్లాదరాయుల ఊరేగింపు నిర్వహిస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement