సమరదీక్ష పోస్టర్, వీడియో ట్రైలర్ విడుదల | samara deeksha poster, video trailer released | Sakshi
Sakshi News home page

సమరదీక్ష పోస్టర్, వీడియో ట్రైలర్ విడుదల

May 23 2015 12:22 PM | Updated on Apr 4 2018 9:31 PM

సమరదీక్ష పోస్టర్, వీడియో ట్రైలర్ విడుదల - Sakshi

సమరదీక్ష పోస్టర్, వీడియో ట్రైలర్ విడుదల

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సమరదీక్ష పోస్టర్, వీడియో ట్రైలర్ను పార్టీ నేతలు విడుదల చేశారు.

విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సమరదీక్ష పోస్టర్, వీడియో ట్రైలర్ను పార్టీ నేతలు విడుదల చేశారు. శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

 ప్రజా సమస్యలను పరిష్కరించంలో అధికార టీడీపీ వైఫల్యాన్ని ఎండగడుతూ జూన్ 3, 4 తేదీల్లో వైఎస్ జగన్ మంగళగరిలో సమరదీక్ష చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏడాది పాలనలో చంద్రబాబు వైఫల్యాలను సమరదీక్ష ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తామని విజయసాయి  రెడ్డి అన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసగించిన వైనాన్ని ఎండగడతామని చెప్పారు. సమరదీక్షను విజయవంతం చేయాలని ఉమ్మారెడ్ది వెంకటేశ్వర్లు కోరారు. వైఎస్ఆర్ సీపీ నేతలు సమరదీక్ష పోస్టర్, వీడియో ట్రైలర్ను విడుదల చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement