పనబాక కాన్వాయ్ ని అడ్డుకున్న సమైక్యవాదులు | Samaikyandhra protest to cabinet Minister Panabaka lakshmi | Sakshi
Sakshi News home page

పనబాక కాన్వాయ్ ని అడ్డుకున్న సమైక్యవాదులు

Sep 19 2013 8:43 AM | Updated on Sep 1 2017 10:51 PM

కేంద్రమంత్రి పనబాక లక్ష్మికి సమైక్య సెగ తగలింది. బాపట్లలో ఈరోజు తెల్లవారుజామున ఆమె కాన్వాయ్ ని సమైక్యవాదులు అడ్డుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

బాపట్ల : కేంద్రమంత్రి పనబాక లక్ష్మికి సమైక్య సెగ తగలింది. బాపట్లలో ఈరోజు తెల్లవారుజామున ఆమె కాన్వాయ్ ని సమైక్యవాదులు అడ్డుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  పనబాక లక్ష్మి రాకపై సమాచారం అందుకున్న సమైక్యవాదులు పెద్ద ఎత్తున బాపట్ల రైల్వేస్టేషన్ వద్దకు చేరుకున్నారు.

అయితే వారి ప్రయత్నాలను ముందే పసిగట్టిన పోలీసులు సమైక్యవాదులను రైల్వేస్టేషన్ లోకి రాకుండా అడ్డుకున్నారు. దాంతో మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ గడియారం స్తంభం సెంటర్లో బైఠాయించి నిరసన తెలిపారు. కాగా పనబాక లక్ష్మి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇక కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు కూడా ఏలూరు వచ్చిన సందర్భంగా సమైక్యవాదులు అడ్డుకున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement