AP: రైలులో దోపిడీ దొంగల బీభత్సం | Train Robbery Between Bapatla and Appikatla | Sakshi
Sakshi News home page

AP: రైలులో దోపిడీ దొంగల బీభత్సం

Apr 19 2026 7:39 AM | Updated on Apr 19 2026 11:22 AM

Train Robbery Between Bapatla and Appikatla

సాక్షి, బాపట్ల జిల్లా: రైలులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బెంగుళూరు- నరసాపురం(07154) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలులో నాలుగు కోచ్‌ల్లో చోరీకి పాల్పడ్డారు. ఎస్7, ఎస్11, ఎస్12, ఎస్13 కోచ్‌లలో ప్రయాణికుల నుండి సుమారు 11 తులాలు బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బాపట్ల- అప్పికట్ల మధ్య ఘటన జరిగింది. అప్పికట్లలో రైలు అపి దుండగులు దిగిపోయారు. విజయవాడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ నెల ఏప్రిల్ 15న మహారాష్ట్రలోని మన్వత్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో కాకినాడ-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్(17206)లో దోపిడీ దొంగలు చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. సిగ్నల్ వ్యవస్థను దెబ్బతీసిన దొంగలు.. రైలును ఆపి, మహిళా ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలను దోచుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైళ్లలో దోపిడీలు వరసగా జరగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. రాత్రి సమయంలో దోపిడీ దొంగలు టార్గెట్‌ చేస్తున్నారుజ ఇటీవల సికింద్రాబాద్‌, నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో దోపిడీ ఘటనలు వెలుగుచూశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement